జగిత్యాలలో క్షుద్ర పూజలు కలకలం


ఓ మెస్‌ షట్టర్‌ ఎదుట కోడి పీక కోసి రక్తం దారా పోత  

పసుపు,కుంకుమలతో అగంతకులు ప్రత్యేక పూజలుI

ఘటన స్థలానికి పోలీసుల చేరుకుని దర్యాప్తు

జగిత్యాల,మే 01, (ఇయ్యాల తెలంగాణ) : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ మెస్‌ షట్టర్‌ ఎదుట కోడి పీక కోసి రక్తం దారా పోసి,పసుపు,కుంకుమలతో అగంతకులు క్షుద్రపూజలు చేసిన సంఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తేజిల్లా కేంద్రంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజన్న కరీంనగర్‌ రోడ్డులోని లేబర్‌ అడ్డా సవిూపంలో గత 10 సంవత్సారాలుగా మహాలక్ష్మి మెస్‌ నడుపుతున్నాడు..రోజు వారి తమ విధుల్లో భాగంగా మెస్‌ యజమాని అంజన్న సోమవారం వేకువ జామున మెస్‌ వద్దకు వచ్చి సంచులతో మార్కెట్‌ వెళ్లి కూరగాయలుతీసుకువద్దామని మెస్‌ వద్దకు వచ్చాడు ఈ క్రమంలో మెస్‌ షట్టర్‌ ఎదుట రక్తం, కోసిన కోడి,పసుపు, కుంకుమ నిమ్మకాయలు కనిపించడంతో అంజన్న అవ్వక్కయ్యాడు..గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి మెస్‌ షట్టర్‌ ఎదుట పసుపు, కుంకుమ  నిమ్మకాయలు పేర్చి కోడి పీక కోసి రాత్రి క్షుద్ర పూజలు చేసి వదిలి పెట్టి వెళ్ళినట్లు గుర్తించిన యజమాని అంజన్న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేస్తున్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....