జనసంద్రంతో నిండిపోయిన జన గర్జన సభ

 ఖమ్మం, జులై 2 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెల వృద్దులకు, వితంతువులకు చేయూత పథకం ద్వారా  4000/- రూపాయల పింఛను అందిజేస్తామని జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.ఖమ్మలో ఈ రోజు జరిగిన తెలంగాణ జన గర్జన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ  కర్ణాటకలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించామని  తెలంగాణాలో కూడా అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని రాహుల్ గాంధీ ముందస్తు జోస్యం చెప్పారు. అవినీతి ప్రభుత్వాలతో ప్రజలు విసిగి చెందిపోయారని తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపి పార్టీ చేతుల్లో కీలు బొమ్మ అని తెలియజేశారు. టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిన కేసీఆర్ ప్రభుత్వం పగ్గాలన్నీ బిజెపి చేతుల్లో ఉన్నాయని అన్నారు. 

బిజెపి ప్రవేశ పెట్టిన అన్ని రకాల మేనిఫెస్టో లకు కేసీఆర్ ప్రభుత్వం తోడ్పాటు నందించిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యంత ఘాటుగా విమర్శించారు యువనేత రాహుల్ పేదల బ్రతుకుల్లో వెలుగులు నిండాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యపడుతుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లి పోయిన వారంతా ఇప్పుడు చాలా బాధ పడుతున్నారని అనేక మంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క తన పాదయాత్రను కూడా ఈ రోజు తో ముగించడంతో బట్టి పాదయాత్ర అనుభవాలు కేసీఆర్ విధానాల వ్యతిరేకతపై సభలో బట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ముఖ్య నేతలు అధిక సంఖ్యలో జన సందోహంతో సభా ప్రాంగణం వెల్లి విరియడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెళ్లి విరిసినట్లు కనిపించింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ఎన్నికల శంఖారావం పూరించిన రాహుల్ గాంధీ :

 ఖమ్మం తెలంగాణ గర్జన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్స్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం మోగించినట్లే నని పార్టీ నేతలు తెలియజేశారు. రాహుల్ ఖమ్మం తెలంగాణ గర్జన సభతో నూతనోత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక లో వచ్చిన ఫలితాలే తెలంగాణ రాష్ట్రంలో రిపీట్ అవుతాయని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ అని కేసీఆర్ రిమోట్ మోడీ చేతిలో ఉన్నదని రాహుల్ గాంధీ అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి అంతా మోడీ కి తెలుసునని అయినప్పటికీ ఎందుకు కాముగా ఉన్నారని మనం ప్రశ్నించుకొని ఆలోచించాలని కోరారు. ఇందిరమ్మ, ఎస్సి ఎస్టీ ఆస్తులన్నీ ధరణి పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం దోచుకుంటుందని రాహుల్ గాంధీ అన్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....