జగిత్యాల సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ ); దేశంలో ఏ రాజకీయ పార్టీ కల్పించని విధంగా జనసేన పార్టీ సభ్యత్వంలో కార్యకర్త కుటుంబ భద్రతపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారని జనసేన పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బెక్కం జనార్దన్ అన్నారు. శుక్రవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ సభ్యత్వ కిట్లను జనార్దన్ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ కిట్టులో పవన్ కళ్యాణ్ మనోగతాన్ని ముద్రించిన పుస్తకం, పార్టీ నోట్ బుక్, సభ్యత్వ ఐడి, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసు, 5 లక్షల బీమాతోపాటు గాయపడితే 50 వేల తక్షణ ఆర్థిక సహాయం అందించే భరోసా కల్పిస్తున్న బ్రోచరునుఅందించామన్నారు. నియోజకవర్గములో 150 మందికిపైగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ప్రతి పల్లెకు జనసేన్స్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జనార్దన్ తెలిపారు. రాయీకల్, సారంగపూర్ గ్రామాల్లో భూతు కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మండల అధ్యక్షులు బొల్లి రాము, ఉపాధ్యక్షులు బొల్లి లక్ష్మణ్, సెక్రటరీ గొడుగు శ్రీనివాస్, గొడిసెల మనోజ్ కుమార్, పట్టణ అధ్యక్షులు చింత సుదీర్ ఉపాధ్యక్షులు కిరణ్ సింగ్, రాయికల్ మండల అధ్యక్షులు మల్లికార్జున్, సెక్రటరీ బాబు శివ కుమార్, సారంగపూర్ మండల నాయకులు తోకల శ్రీధర్, సంజీవ్, సంకీర్తన్,వీర మహిళ విభాగం మొగులోజి విజయ, పద్మ, ఉమాదేవి, స్వప్న, జన సైనికులు తదిరతులు పాల్గొన్నారు.
జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ 5 లక్షల ప్రమాద బీమాతో ఆర్థిక భరోసా
Leave a Comment