జలపాతంలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గల్లంతు

ముంబయి జూలై.  1 (ఇయ్యాల తెలంగాణ ):  జలపాతంలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గల్లంతైన సంఘటన మహారాష్ట్ర లోనావాలా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం?. ఓ కుటుంబంలో ఆరుగురు సభ్యులు సరదా కోసం విహారయాత్రకు వెళ్లారు. లోనావాలాలోని ఓ డ్యామ్‌ వద్దకు జలపాతాన్ని వారు వీక్షిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆరుగురు జలపాతంలో పడిపోయారు. నీటిలో కొట్టుకొనిపోయి రిజర్వాయర్‌లో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో గాలించగా మహిళ, ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. మిగితా ముగ్గురు కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....