హైదరాబాద్ ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ ): మంత్రి మల్లారెడ్డి
తన అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ చర్చపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. గురువారం అయన అసెంబ్లీ లాబీలో విూడియాతో మాట్లాడారు. మేడ్చెల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థి ఉండాలో నేనే డిసైడ్ చేస్తా. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థి ఉండాలో నేనే డిసైడ్ చేస్తా. గతసారి కేఎల్‌ఆర్ కు టికెట్ నేనే ఇప్పించినా! కాంగ్రెస్ అధిష్టానం నాకు దోస్తులు ఉన్నారని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దగ్గర డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప వేరే సబ్జెక్టు లేదు. నేను చేసిన అభివృద్ధి ప్రజలు మర్చిపోయి…ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారు. మంత్రివర్గ విస్తరణ అంటే మల్లారెడ్డి పోస్ట్ ఉడుతుంది అనే ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి పై తొడగొట్టిన తరువాత గ్రాఫ్ పెరిగింది. కొంతమంది విూడియా అసత్య ప్రచారం కక్షపురితంగా చేస్తోంది. త్వరలోనే విూడియా సంస్థ` ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానని వెల్లడిరచారు.