డయాగ్నాస్టిక్స్‌ పరీక్షలను ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

 

హైదరాబాద్‌ జులై,1,(ఇయ్యాల తెలంగాణ ):కోండాపుర్‌ జిల్లా హాస్పిటల్‌ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నొస్టిక్‌ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్‌ మోడ్‌ లో మంత్రి హరీశ్‌ రావు శనివారం ప్రారంభించారు. మంత్రి హరిష్‌ రావు విూడియాతో మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నిస్టిక్‌ సేంటర్‌ లు ,16 రేడియాలజి సేంటర్‌ లను ప్రారంబించడం జరిగింది. తెలంగాణ డయాగ్నిస్టిక్‌ ద్వారా ఇప్పటి వరకు యాబై నాలుగు పరిక్షలు చేస్తుంటే ఇక నుంచి నూట యాబై నాలుగు పరిక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. పరిక్ష ఫలితాలను పేషంట్‌ మైబైల్‌ లకు డాక్టర్‌ లకు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ హస్పిటల్‌ లలో టిఫా స్కాన్‌ లు ,టుడికోం రేడియాలజి ల్యాబ్‌ లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచ వైద్యులు దీనోత్సవం పురస్కరించుకుని వైద్యులకు అయన శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ హస్పిటల్‌ లలో పని చేస్తున్న వైద్యులు చాలా కష్టపడ్డారు. ప్రభుత్వ వైద్యులు రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణ మార్చారు. ప్రభుత్వ హస్పిటల్‌ లను కార్పోరేటర్‌ హాస్పిటల్‌ లకు ధీటుగా మారాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు పేద ప్రజలను ప్రభుత్వ హస్పిటల్‌ లకు తిసుకోరావడానికి కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసిఆర్‌ కిట్‌, న్యుట్రిషియన్‌ ఫుడ్‌ అందించడం జరుగుతుంది. కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ హస్పిటల్‌ లలో ముప్ఫై శాతం డెలివరి లు అయితే ఇప్పుడు 70శాతం అవుతున్నాయి. పేద ప్రజలకు నిమ్స్‌ లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....