‘డెవిల్‌’.. డిసెంబర్‌ 29న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ రిలీజ్‌

 డిసెంబర్ 7 (ఇయ్యాల  సినిమా) ;వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్‌ పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ ‘డెవిల్‌’. ‘ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ ట్యాగ్‌ లైన్‌. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్‌ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే హీరోయిన్‌ సంయుక్తా విూనన్‌ లుక్‌ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు కళ్యాణ్‌ రామ్‌ చేయనటువంటి జోనర్‌ మూవీ.. భారీ బడ్జెట్‌ తో చేస్తున్నారు. దీంతో  సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ క్రియేట్‌ అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 29న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ చేయబోతున్నారు.

‘డెవిల్‌’ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఆయన ఛేదించే బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఆకట్టుకోబోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్‌ రామ్‌ ఈ ఏడాది ‘డెవిల్‌’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.

 అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై  అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాకు   శ్రీకాంత్‌ విస్సా  మాటలు, స్క్రీన్‌ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత సారథ్యం వహిస్తుండగా సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. గాంధీ నడికుడికర్‌ ఈ సినిమాకు ప్రొడఓన్‌ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....