డేంజర్‌ జోన్‌లో – Hyderabad

హైదరాబాద్‌, నవంబర్‌ 26, (ఇయ్యాల తెలంగాణ) :  దేశ రాజధాని డిల్లీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వాయుకాలుష్యం. అవును.. ఇప్పుడు డిల్లీలో ఏ మూల చూసిన వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇది రోజురోజుకీ పరుగుతుంది. అక్కడి కాలుష్య చేయి దాటిపోయింది  మరీ.. ప్రస్తుతం డిల్లీ లోని చాలా ప్రాంతాల్లో సగటు గాలి నాణ్యతా సూచీ  500 మార్కులు దాటేసింది. దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే దక్షిణాదిన డిల్లీ మాదిరే మరో కాలుష్య నగరం తయారవుతోంది. అది హైదరాబాదే. ఈ మహానగరానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన వారు ఉపాధి పొందుతుంటారు. విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చి ఆవాసం ఏర్పాటు చేసికుని ఉంటున్నారు. ఇలాంటి హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్య భూతం కబలిస్తుంది. గత వారం రోజులుగా ఈ మహానగరంలో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆదివారం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ దారుణంగా పడి పోయింది. చాలా ప్రాంతాల్లో 300 మార్కు దాటేసింది.

ముఖ్యంగా కూకట్‌పల్లి, మూసాపేట్‌, బాలానగర్‌, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇన్‌డెక్స్‌ 300 దాటి పోయింది. డిల్లీ కి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవడం అత్యంత ఆందోళన కరంగా మారింది. పరిస్థితి చేజారక ముందే చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే అతి త్వరలోనే జంట నగరాల వాసులు శ్వాస కోశ వ్యాధుల భారీన పడే ప్రమాదం ఉంది. ఒక్కసారిగా కాలుష్యం పెరగానికి వాహనాలు ఒక కారణమైతే.. ఎక్కడో ఊరి బయట ఉండే ఫ్యాక్టరీలు ఇప్పుడు నగరం మధ్యలో తిష్టవేశాయి. దీంతో వాయి కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. వాయు కాలుష్యం మాత్రమే కాదు హైదరాబాద్‌లో రకాల కాలుష్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇక రోడ్లపై ట్రాఫిక్‌ వ్యవస్థ పూర్తిగా తారుమారైంది. రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్‌ సిబ్బంది చలానాలు రాయడంలోనే మునిగిపోతున్నారు. దీంతో ట్రాఫిక్‌ నియంత్రణ లేకపోవడంతో వాయు, శబ్ద కాలుష్యం మరింత పెరుగుతుంది.గతంలో రోడ్లకి ఇరువైపులా ఎంతో కొంతమేర భారీ వృక్షాలు ఉండేవి. రోడ్ల విస్తీర్ణం పేరుతో వాటినీ తొలగించారు. దీంతో ఎందరికో ఆశ్రయం ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్‌ మహానగరం కాలుష్య కోరల్లో చిక్కుకుని దాని వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ రోజు కూడా నగరంలో కాలుష్యం 300 మార్క్‌ వద్దే కొనసాగుతుంది. ఇదిలాగే కొనాసాగితే హైదరాబాద్‌ కూడా మరో డిల్లీ అవుతుందని నగర వాసులు భయకంపితులవుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....