ఢల్లీలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

న్యూ డిల్లీ అక్టోబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ ):ఢల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్‌టెండర్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పీరాగర్హి మెట్రో స్టేషన్‌కు సవిూపంలో ఉన్న బూట్లకు సంబంధించిన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....