అనంతపురం జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆవుల ఆనందరావు ఆత్మహత్య కలకలం రేపింది. దాంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు నెలకొన్నాయి.సీఐ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసు వారి విచారణలో వెలుగులోకి రానున్నాయి. 1996 బ్యాచ్ కు చెందిన తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయన గతంలో కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాలలో యస్‌ఐ గా, సీఐ గా విధులు నిర్వర్తించారు. పోలీసు అధికారుల దగ్గర, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు సిబ్బందిని ఒక అన్నగా.. తమ్ముడిగా.. ఎంతో ఆప్యాయంగా పలకరించే వారు.. ఆయన సంభోదనలో ఎం మిస్టర్ అంటూ సిబ్బందిని గౌరవించేవారు. కడప జిల్లాలో ఏఆర్ యస్‌ఐ కుమార్తెను వివాహం చేసుకున్నారు. సీఐ ఆనందరావు కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు..
- Homepage
- General News
- తాడిపత్రి సిఐ ఆత్మహత్య
తాడిపత్రి సిఐ ఆత్మహత్య
Leave a Comment