‘‘తుఫాను హెచ్చరిక’’. Title ఫస్ట్‌ లుక్‌ విడుదల

 

శ్రీ పాద క్రియేషన్స్‌ బ్యానర్‌ రెండో చిత్రం గా సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘‘తుఫాను హెచ్చరిక’’. టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్‌ నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ జగదీష్‌ కె కె మాట్లాడుతూ, ‘‘చిష్ట్రవని బితిఎవ శ్రీనీఞసబ జీశ్రీశ్రీ వనీబీతీ టనీనీతీబ, టవబబితినివ పతీతినిణబ వనీబీ బిష్ట్రవ సవవ’’ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న మా చిత్రం ఈ ఉప శీర్షిక విూదే రూపొందించబడిరది. ఒక అందమైన హిల్‌ స్టేషన్‌ లో మంచిగా నివసించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులనుంచి తాను ఎలా బయట పడ్డాడన్నదే మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ థ్రిల్లింగ్‌ సినిమాటిక్‌ విజన్‌ కి ప్రాణం పోయడం అనేది మా ప్రతిభావంతులైన తారాగణం యొక్క లక్ష్యం. మా సాంకేతిక నిపుణుల మధ్య ఉన్న అపురూపమైన సమన్వయాన్ని నేను తప్పక హైలైట్‌ చేయాలి. ఆర్టిస్టులు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అతి తక్కువ ఉష్ణోగ్రతలలో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ సన్నివేశాన్ని చక్కని భావోద్వేగాలతో సజావుగా ప్రదర్శించారు.

లంబసింగి మరియు చింతపల్లిలోని మంచుతో కూడుకున్న పచ్చని కొండలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కథలో అంతర్భాగమైన ప్రకృతి సౌందర్యాన్ని చూపించడానికి కారణం అయ్యాయి. చిత్రీకరణను పునఃప్రారంభించడానికి మరియు ఆ అందమైన సీజనల్‌ వేరియేషన్‌ లను సరిగ్గా చిత్రీకరించడానికి మేము ఏడాది పొడవునా ఓపికగా వేచి ఉండాల్సి వచ్చింది. దాని ఫలితాన్ని విూరు త్వరలో వెండి తెరపై చూడబోతున్నారు.

హిల్‌ స్టేషన్‌ లో ఉండే ఆ ఫ్రెష్‌ నెస్‌ స్పష్టంగా ఫీల్‌ అయ్యేలా చేసిన మా సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌ కె నాయుడు చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ పట్ల నా అభిరుచిని పంచుకుని చిత్రీకరణలో ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా సపోర్ట్‌ చేసిన మా నిర్మాతలు డా.శ్రీనివాస్‌ కిషన్‌, డా.రజనీకాంత్‌, సన్నీ బన్సల్‌  లకి నా కృజ్ఞతలు. అలాగే డైరెక్షన్‌ డిపార్ట్మెంట్‌, ఆర్ట్‌, మ్యూజిక్‌, మిగిలిన అన్ని క్రాఫ్ట్‌ ల టెక్నీషియన్లు చాలా చక్కగా సహకరించారు.

ఈ ఉత్కంఠభరితమైన చిత్రంలో లీనమైపోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఈ చిత్రంలో ప్రతి మలుపు ఖచ్చితత్వంతో మరియు అభిరుచితో రూపొందించబడిరది. ఈ చిత్రం కేవలం కథ కాదు, ఒక అనుభవం మరియు ఇది మిమ్మల్ని అలరిస్తుంది నేను నమ్ముతున్నాను. 48 గంటలలోపు టైటిల్‌ వెల్లడి చేయబడే ఉత్కంఠభరితమైన సమయం కోసం విూతో పాటు నేను కూడా వేచి చూస్తున్నాను.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....