తెలంగాణలో Group 2, 3 పరీక్షలు వాయిదా వేశారా ?

హైదరాబాద్‌, జూలై 11  (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. పోస్టులు పెంచి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థుల రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుని ఎగ్జామ్‌ రీషెడ్యూల్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. రీ షెడ్యూల్‌ అయిన తెలంగాణ గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 ఎగ్జామ్‌ డేట్లు అని ఓ ప్రకటన సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఆ నోటీసుపై టీజీపీఎస్సీ అధికారులు స్పందించారు.తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీక్షల తేదీలు మార్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్‌ విూడియాలో వైరల్‌ ప్రకటనలో వాస్తవం లేదని, అదంతా ఫేక్‌ న్యూస్‌ అని టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. అభ్యర్థులు వాటిని నమ్మకూడదని, అధికారిక ప్రకటనల్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. గ్రూప్‌ 2 ఎగ్జామ్‌ ఆగస్టులో జరగాల్సి ఉండగా, నవంబర్‌ 17, 18 తేదీలలో నిర్వహించడానికి టీజీఎస్సీ రీషెడ్యూల్‌ చేసిందని ప్రచారం జరిగింది. అదే విధంగా గ్రూప్‌ 3 ఎగ్జామ్‌ నవంబర్‌ 24, 25 తేదీలకు వాయిదా వేసినట్లు టీజీసీఎస్సీ పేరుతో ఓ ప్రకటన వైరల్‌ అయింది. దానిపై టీజీపీఎస్సీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 నియామక పరీక్షలను వాయిదా వేయలేదని, అభ్యర్థులు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు.తెలంగాణలో మొత్తం 783 గ్రూప్‌`2 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 29 డిసెంబర్‌ 2022న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఒక్కో పోస్టుకు దాదాపు 700 మంది చొప్పున పోటీ నెలకొంది. గత ఏడాది నవంబర్‌ నెలలో గ్రూప్‌ 2 ఎగ్జామ్‌ నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. తాము అధికారంలోకి రాగానే జనవరిలో గ్రూప్‌ 2 ఎగ్జామ్స్‌, వెంటనే గ్రూప్‌ 3 సైతం నిర్వహిస్తామని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం జరిగిపోయాయి. కాంగ్రెస్‌ తెలంగాణలో తొలిసారి అధికారంలోకి రాగా, జనవరిలో నిర్వహించాల్సిన గ్రూప్‌ 2 ఎగ్జామ్‌ వాయిదా వేశారు. టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌ గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని నియమించి పోస్టుల భర్తీపై ఫోకస్‌ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌`2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ పోస్టులు పెంచడంతో పాటు పరీక్షను వాయిదా వేసి, రీషెడ్యూల్‌ చేయాలన్న డిమాండ్‌ వస్తోంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ సహా వీలున్న చోట నిరసన తెలుపుతున్నారు. డీఎస్సీ సైతం పోస్టులు పెంచాలని, పరీక్షలు వాయిదా వేసి పకడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నారు. మహిళా అభ్యర్థులు సైతం రాత్రి అని చూడకుండా ఓయూ వద్ద నిరసన తెలిపారు. సిలబస్‌ చాలా పెంచారని, తక్కువ సమయంలో సబ్జెక్ట్‌ చదవడం పూర్తి కాదని, ప్రభుత్వం తమ సమస్యల్ని పట్టించుకోవాలన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....