తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వేలలో కచ్చితత్వం ఉందా?

చొప్పదండి అక్టోబర్ 26  (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం చెలరేగింది..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వేలు కచ్చితత్వం ఉందానేది ప్రశ్నార్థకంగా మారుతోంది..ఎవిరికి వారే సర్వేలు చేయించి మాదే అధికారం అనిఊహాలోకాల్లో ఉంటున్నాయి వివిధ రాజకీయ పార్టీలు.తెలంగాణ ఎన్నికల బరిలో దాదాపు అన్ని పార్టీలు దిగుతున్నాయి.అయినా ఇప్పటి వరకు అభ్యర్థులు పూర్తి స్థాయిలో కొన్ని పార్టీలు ప్రకటింక పోవడంఅయిన ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే మాకు సీటు వస్తుందని ధీమాతో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇంకా పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేదు. బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీలు  అభ్యర్ధుల తొలి జాబితాను మాత్రమే ప్రకటించాయి.  అన్నింటికీ  మించి ఈ సారి ఎన్నికలలో కింగ్‌ మేకర్‌ పాత్ర, అంత కంటే ఎక్కువ అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా పోటీవిషయంలోనే స్పష్టత ఇవ్వలేదు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉండటంతో పార్టీ నడిపించే నాయకులు సతమతమవుతున్నారు. తెలుగుదేశం ఈ సారి పోటీ విషయంలో సారీచెప్పేస్తుందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో వస్తున్నాయి.ఇక తాను ఎన్డీయే భాగస్వామినే అని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో ఇప్పటికే 36 స్థానాలలో పోటీకి రెడీ అని ప్రకటించేశారు. బీజేపీఅయితే జనసేనను మద్దతుకే పరిమితం కావాలి..పోటీ వద్దు అని కోరుతోంది. దీనిపై జనసేనాని ఏ నిర్ణయం తీసుకున్నారో.. తీసుకుంటారో అన్న విషయంలో క్లారిటీ లేదు. మరో వైపు ఏపీలో మాత్రంజనసేనానికి తెలుగుదేశంతో పొత్తు ఖరారు చేసేశారు. సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తో ఉమ్మడి సమావేశంలో పాల్గొన్నారు. మరి అదేసయోధ్య, సమన్వయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇరు పార్టీల మధ్యా అంటే తెలుగుదేశం, జనసేన మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  అన్ని పార్టీలలోనూ అసమ్మతి రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జంపింగ్‌ లు కూడా అన్ని పార్టీలకూ తలనొప్పిగానే ఉన్నాయి. అభ్యర్థులు ఎవరు? రెబల్స్‌ గా ఎవరు బరిలోకి దిగుతారు? అన్నది ఇంకాక్లారిటీ రాలేదు. షర్మిల పార్టీతో పాటు, దళితుల్లో బలం ఉన్న బీఎస్పీ ఇప్పటికే రంగంలో ఉన్నట్లు ప్రకటించాయి. ఆ దిశగా బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు డా ప్రవీణ్‌ కుమార్‌ ప్రచారం ముమ్మరంగానిర్వహిస్తున్నారు.ఆ రెండు పార్టీలకూ సొంతంగా విజయం సాధించే బలం లేకున్నా.. ఏదో మేరకు కనీసం కొన్ని నియోజకవర్గాలలోనైనా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలుగుతాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడి ఇన్ని రోజులైనా.. ఇప్పటి వరకూ పార్టీల అభ్యర్థులు, వారి బలాబలాలు, తెలుగుదుశం, జనసేనల నిర్ణయం ఏమిటి? ఒక వేళ రెండూ పోత్తు పెట్టుకునితెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో దిగితే సవిూకరణాలు ఎలా ఉంటాయి? జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరితే సవిూకరణాలు ఎలా మారుతాయి? తెలుగుదేశం ఒంటరిగా బరిలోకి దిగితే పరిస్థితి ఏమిటి?అసలు పోటీలో లేకుండా ఉంటే ఏమౌతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం రాకుండానే.. తెలంగాణలో అధికారం ఈ పార్టీదే.. కాదు కాదు ఆ పార్టీదే అంటూ వెలువడుతున్న సర్వేలకు విశ్వసనీయతఎమిటి? ఎంత? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎన్నికల వేడి అయితే బాగా పెరిగింది కానీ.. ఏయే పార్టీలు అధికారం రేసులో ముందుంటాయి? ఏయే పార్టీలు వెనుకబడతాయి అన్నప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడ్‌ ఆఫ్‌ ది తెలంగాణ అన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని అంటున్నారు.గతతొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ, ఈ సారి అధికారం మాదే అనివిశ్వాసం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీలకు కూడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ విూడియా సంస్థలు, స్థానిక సంస్థలు వెలువరిస్తున్న సర్వేలు వాస్తవపరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని నమ్మడం కష్టమేనని చెబుతున్నారు.  పార్టీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే.. రాష్ట్రంలో పొత్తుపొడుపులపై చర్చలు ఇంకా సాగుతుండగానేవెలువడిన సర్వేల ఫలితాలను ఎలా విశ్వసించగలమని రాజకీయవర్గాలు అంటున్నాయి.  తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్‌ అధికారం చే జిక్కించుకోవడం తథ్యమని జాతీయ విూడియా సంస్థలు చెబుతుంటే..బీజేపీ అనుకూల విూడియా మాత్రం హంగ్‌ తథ్యమని జోస్యం చెబుతోంది.  లోక్‌పోల్‌  సర్వే బీఆర్‌ఎస్‌కు 45`51 సీట్లు కాంగ్రెస్‌కు 61`67 సీట్లు వస్తాయని పేర్కొంటే.. పోల్‌  బీఆర్‌ఎస్‌కు40`కాంగ్రెస్‌కు 64 సీట్లు, తెలంగాణ పల్స్‌ బీఆర్‌ఎస్‌కు 46`54, జన్‌మత్‌ సంస్థ బీఆర్‌ఎస్‌ 45`47, కాంగ్రెస్‌ 58`60Ñ ఏబీపీ`సీ ఓటర్‌ సంస్థ బీఆర్‌ఎస్‌ 43`55, కాంగ్రెస్‌కు 54 సీట్లువస్తాయని జోస్యం చెప్పింది. ఈ సర్వేలను పరిశీలిస్తే.. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్‌ బలంగా పుంజుకుందన్నది మాత్రం స్పష్టమౌతున్నది. అలాగే ఇంత కాలం బీజేపీ బలంగా చూపుకున్నది కేవలం వాపుమాత్రమేనని తేటతెల్లమౌతున్నది. తెలుగుదేశం పోటీపై స్పష్టత వచ్చిన తరువాత, అలాగే జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగుతాయా అనితేలిన తరువాత తెలంగాణలో రాజకీయ సవిూకరణాలలో గణనీయమైన మార్పు రావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు వెలువడిన సర్వేలలో కచ్చతత్వం ఉందని భావించడం సరికాదని అంటున్నారు. సర్వేలు ప్రజలలో నమ్మకం లేకుండా చేస్తున్నాయి..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....