తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 25 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోప్రారంబమైంది. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో . జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు . కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, విూనాక్షీ లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు జానారెడ్డి, కంభంపాటి హరిబాబు, రాధా కృష్ణన్‌, వీ.హనుమంతరావు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారందరిని దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....