ఈ నెల 31వ తేదీలోపల దరఖాస్తుల స్వీకరణ : కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి కొత్తగూడెం, మే 26 (ఇయ్యాల తెలంగాణ) : జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై నిర్వహించనున్న కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనే కవులు తమ పేర్లు ఈ నెల 31వ తేదీ లోగా డీపీఆర్‌ఓ కార్యాలయంలో కానీ 9949351653 నెంబర్ కు వాట్సప్ ద్వారా వివరాలు పంపి పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు కొత్తగూడెం క్లబ్ లో కవి సమ్మేళన కార్యక్రమానికి ఏర్పాట్లు భాద్యతలను డిపిఆర్‌ఓ, జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ చేయాలని ఆయన చెప్పారు. కవిత 3 నిమిషాల వ్యవధిలో చెప్పే విదంగా ఉండాలని, కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు వారి కవితతో పాటు ఒక పాస్ ఫోటో వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఎంపిక చేసిన 5 కవితలకు ప్రశంస పత్రం, మెమెంటో అందచేయడం జరుగుతుందని చెప్పారు.31వ తేదీ తదుపరి వచ్చిన కవుల పేర్లు పరిగణనలోకి తీసుకోమని అన్నారు. ఈ నెల 31వ తేది సాయంత్రం 5 గం’’ల వరకు పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.