తెలుగు Movie ‘జటాధార’ కోసం పవర్‌ ఫుల్‌ అవతార్‌ లో సోనాక్షి సిన్హా !

సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ జటాధార మూవీతో హీరోయిన్‌ సోనాక్షి సిన్హా తెలుగులోకి పరిచయం అవుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కొత్త పోస్టర్‌ను రివిల్‌ చేశారు మేకర్స్‌. ఈ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ లో యాక్షన్‌, మిస్టరీతో కూడిన పవర్‌ ఫుల్‌ అవతార్‌ లో కనిపించనున్నారు. హీరామండిలో ఆమె పవర్‌ ఫుల్‌ పాత్ర తర్వాత, సోనాక్షి పౌరాణికాలు, యాక్షన్‌, అతీంద్రియ అంశాలను బ్లెండ్‌ చేసే పాన్‌`ఇండియా చిత్రం జటాధారతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.  జటాధార ప్రయాణం ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్‌ ముహూర్త వేడుకతో ప్రారంభమైంది, దీనికి పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు, టీం మౌంట్‌ అబూ అడవుల్లోకి వెళుతోంది, అక్కడ మౌకా స్టూడియోస్‌లో సినిమా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జీవం పోయడానికి ఒక అద్భుతమైన అడవి సెట్‌ నిర్మించింది. ఈ చిత్రం స్కేల్‌, ఎపిక్‌ జర్నీ హై`ఆక్టేన్‌ యాక్షన్‌లో విజువల్‌ అద్భుతమైన అనుభవాన్ని హావిూ ఇస్తుంది.సుధీర్‌ బాబు లీడ్‌ రోల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వెంకట్‌ కళ్యాణ్‌ దర్శకత్వం వహించగా, జీ స్టూడియోస్‌ ఉమేష్‌ కెఆర్‌ బన్సాల్‌, ప్రేరణ అరోరా, అరుణ అగర్వాల్‌, శివిన్‌ నారంగ్‌ నిర్మించారు.సహ నిర్మాతలు అక్షయ్‌ కేజ్రీవాల్‌,కుస్సుమ్‌ అరోరా. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్స్‌ గా దివ్య విజయ్‌, సాగర్‌ ఆంబ్రే కూడా ఈ చిత్రానికి కొలబరేట్‌ అయ్యారు.

సోనాక్షి సిన్హా మార్చి 10న షూట్‌ లో జాయిన్‌ అవుతారు అద్భుతమైన కథాంశం, విజువల్స్‌తో ‘జటాధార’ ఈ సంవత్సరంలో మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీస్‌ లో ఒకటిగా నిలుస్తోంది. ఇది మునుపెన్నడూ లేని విధంగా గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ని అందిస్తుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....