తెల్లవారుజాము నుంచే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ లోని పలువురు రాజకీయనేతలు, వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ ఫోకస్‌ పెట్టింది. తాజాగా మంత్రి చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుళ్ళ నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. 50 టీమ్స్‌ సహాయంతో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది.మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్‌ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్‌ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్‌ కాలేజీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి.ఇంజనీరింగ్‌, ఫార్మా కాలేజీలు రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో మొత్తాన్ని కూడా డైరెక్టర్‌ గా ఉన్నారు మల్లారెడ్డి అల్లుడు, కుమారుడు. ఐటీ అధికారులు వివిధ పత్రాలు పరిశీలిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి వుంది. కాలేజీల్లో పెద్ద ఎత్తున ట్యాక్స్‌ లు కట్టలేదని అంటున్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక టీంలు రానున్నాయి. అయితే, దీనిపై మల్లారెడ్డి, ఆయన బంధువులు ఎవరూ స్పందించలేదు. సోమవారం రాత్రి 8మంది టీం హైదరాబాద్‌ లోనే వున్నారు. స్థానిక అధికారుల సాయంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు మరికొన్నిచోట్ల పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....