తొలితరం తెలుగు News Reader శాంతి స్వరూప్‌ కన్నుమూత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 : తొలితరం తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ ఇక లేరు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దూరదర్శనలో వార్తలు చదివిన తొలి యాంకర్‌ ఆయనే. ఆయన స్ఫూర్తితోనే చాలా మంది న్యూస్‌ ప్రజెంటర్స్‌గా రాణిస్తున్నారు. 1978లో ఉద్యోగంలో జాయిన్‌ ఆయన 1983 నుంచి వార్తలు చదువుతున్నారు. 2011లో పదవీ విరమణ చేశారు. 1983 బాలన దినోత్సవం సందర్భంగా శాంతిస్వరూప్‌ తొలి వార్తల బులెటిన్‌ చదివారు. దూరదర్శన్‌ ఛానల్‌లో సాయంత్రం 7 గంటలకు ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. అందులో మొదటి వార్తగా బాలల దినోత్సవం సందర్భంగా లాల్‌ బహదూర్‌ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ టీ రామారావు ప్రారంభించారు అని చదివారు. ఇలా 15 నిమిషాల పాటు తెలుగులో తొలి వార్తల బులెటిన్‌ ప్రజలకు పరిచయం చేశారాయన. అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రస్తానం 2011 వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. తెలుగు వార్తా చరిత్ర చెబితే శాంతి స్వరూప్‌కి ఒక చాప్టర్‌ ఉంటుంది.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....