తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి ?

 

భక్తి ప్రతినిధి :  జూలై 10 – ఇయ్యాల తెలంగాణ

ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ ఏకాదశినే శయనేకాదశి అని అంటారు. అందుకే ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు దీనినే ఉత్తాన ఏకాదశి అంటారు.  

తొలి ఏకాదశికి ఆలయాల ముస్తాబు 

జూలై 10 తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాల్లో ఏకాదశి పర్వదినానికి సంబంధించి ఆలయాలను ముస్తాబు చేసింది ఆలయ కమిటీ నగరంలోని తిరుమల తిరుపతి వారి దేవస్థానంతో పాటు బంజారాహిల్స్ లోని వెంకటేశ్వర ఆలయం, జియాగూడ లోని ఆలయాలు తొలి ఏకాదశికి ముస్తాబయ్యాయి. ఇంకా అనేక దేవాలయాలకు సంబంధించి ఉదయం నుంచి భక్తుల తాకిడి ఉన్నందున భక్తుల దర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....