తోలిప్రేమ తర్వాత నేను చూసిన విజయం ఇదే..- Life అంతా దెబ్బలు తిట్లు తిన్నాను..

అమరావతి, జూన్ 05 (ఇయ్యాల తెలంగాణ) : జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దాంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆనందంలో తేలిపోతున్నారు. తమ అభిమాన హీరో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్‌ విూడియా వేదికగా చాలా మంది పవన్‌ కు విషెస్‌ తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీతో పాటు తమిళ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ కూడా పవన్‌ కు అభినందనలు తెలిపారు. 

అలాగే చాలా మంది యంగ్‌ హీరోలు కూడా పవన్‌ పై ప్రేమను సోషల్‌ విూడియాలో వ్యక్త పరుస్తున్నారు. ఇదిలా ఉంటే విజయం సాధించిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ అసక్తికర కామెంట్స్‌ చేశారు. పవన్‌ మాట్లాడుతూ నాజీవితంలో ఇంతవరకు ఎలాంటి విజయం సాధించ లేదు.  ఏం మాట్లాడాలో నాకే తెలియదు. ఒకేఒక్కసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలిప్రేమ అనే విజయాన్ని చూశాను. ఆతర్వాత అంతగా విజయం చూడలేదు. ఆతర్వాత ఎవ్వరూ నేను విజయం సాధించాను అని కానీ, డబ్బులు వచ్చాయని కానీ ఏఒక్క సినిమా విజయం చెప్పలేదు అని అన్నారు పవన్‌ కళ్యాణ్‌ అలాగే నా జీవితమంతా దెబ్బలు తింటాను మాటలు పడుతాను, తిట్టించుకున్నాను. నేను ఎంత ఎదిగానో నాకే తెలియదు. విూ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 కి 21 స్థానాలు గెలిచే వరకు నాకే తెలియదు. అని అన్నారు పవన్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఎమోషనల్‌ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ విూడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ఈ వీడియో లను సోషల్‌ విూడియాలో షేర్‌ చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....