త్వరలోనే తెలంగాణ PRC

హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ ):ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్‌(పీఆర్‌సీ)తో పాటు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని, ఈహెచ్సీ పక్కాగా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. 2వ పీఆర్సీ ని ఏర్పాటు చేసి, 2023 జూలై 1నుంచి అమలయ్యేలా ఏఆర్‌ ను ప్రకటించాలని ఉద్యోగులు కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవాళ లేదా రేపు అసెంబ్లీలో పీఆర్సీ కమిషన్‌ , మధ్యంతర భృతిపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ టీఎన్‌జీవోలు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పీఆర్సీ, హెల్త్‌ కార్డుల జారీ అంశాలపై వారితో మాట్లాడారు.. వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం.సమావేశం ముగిసిన తర్వాత  ఉద్యోగ సంఘాల నేతలు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే పీఆర్సీతోపాటూ మధ్యంతర భృతి కూడా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారని వెల్లడిచారు. అలాగే ఉద్యోగులకు మెరుగైన హెల్త్‌ కార్డు సదుపాయంను కల్పించాలని చూస్తున్నట్లుగా సీఎం కేసీఆర్‌ తెలిపారు. అందువల్ల అసెంబ్లీలో పీఆర్సీ, మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేస్తారనే టీఎన్‌జీవో నాయకులు అనుకుంటున్నారు. 

రెండో పీఆర్సీ ఏర్పాటు చేసి.. జులై 1, 2023 నుంచి అమల్లోకి తేవాలనీ, మధ్యంతర భృతినిప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ని అభ్యర్థించారు. పీఆర్సీతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ భీమాలో అవకాశాలు పెంచాలని.. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని, దీంతో మెరుగైన వైద్యం అందేలా ఈహెచ్‌ఎస్‌ను అందించాలని ఉద్యోగుల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వం తెచ్చిన పీపీఎస్‌ పెన్షన్‌ విధానాన్ని తొలగించి.. ఓపీఎస్‌ను తేవాలని ఉద్యోగులు కోరినట్లు సమాచారం.తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ప్రస్తుత సర్కార్‌కు ఇదే చివరి సెషన్‌, మరో మూడు నాలుగు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్‌!. అందుకే, తాము చేసింది చెప్పుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం? వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయ్‌!. అయితే, అంచనాలకు భిన్నంగా సాగింది తొలిరోజు సెషన్‌. ఒకే ఒక్క సంతాప తీర్మానంతో శాసనసభ వాయిదాపడితే, మండలిలో మాత్రం వరదలపై లైట్‌ హీటెడ్‌ డిస్కషన్స్‌ జరిగాయ్‌!. ఇక, శాసనసభలో కూల్‌గానే కనిపించిన విపక్ష ఎమ్మెల్యేలు? హాట్‌ కామెంట్స్‌తో ఔట్‌సైడ్‌ హీట్‌ పుట్టించారు. సభ ముందుకు ఏడు కీలక బిల్లులు రానున్నాయి. భారీ వర్షాలు, వరదలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మండలిలో విద్య, వైద్యంపై చర్చ జరగనుంది. దీంతోపాటు ఉద్యోగల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....