దక్షిణ ధృవానికి 600 KM దూరంలో Vikram – Lander ను ఫోటో తీసిన NASA ఆర్బిటార్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ) : అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసాకు చెందిన లూనార్‌ రికన్నై’సెన్స్‌’ ఆర్బిటార్‌ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ శాటిలైట్‌కు .. చంద్రయాన్‌`3కి చెందిన విక్రమ్‌ ల్యాండర్‌ చిక్కింది. విక్రమ్‌ను ఆ ఆర్బిటార్‌ ఫోటో తీసింది. ఆ ఫోటోలను నాసా తన సోషల్‌ విూడియాలో పోస్టు చేసింది. ఆగస్టు 23వ తేదీన దక్షిణ ధృవానికి 600 కిలోవిూటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌ దిగినట్లు నాసా పేర్కొన్నది. అయితే ఆగస్టు 27వ తేదీన నాసాకు చెందిన ఎల్‌ఆర్వో ఈ ఫోటోను తీసింది. ల్యాండిరగ్‌ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ ఫోటో తీశారు. విక్రమ్‌ ల్యాండర్‌ను 42 డిగ్రీల కోణంలో ఎల్‌ఆర్వో కెమెరా ఫోటో తీసినట్లు నాసా వెల్లడిరచింది. అయితే ఆ ల్యాండర్‌ నుంచి వెలుబడిన వాయువులు, అక్కడి నేలతో ఇంటరాక్ట్‌ కావడం వల్ల విక్రమ్‌ చుట్టూ ఆ బ్రైట్‌ వెలుతురు కనిపించినట్లు నాసా తెలిపింది.మేరీల్యాండ్లోని గ్రీన్బెల్ట్లో ఉన్న గోడార్డ్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ సెంటర్‌ నుంచి ఎల్‌ఆర్వో కెమెరాలను నాసా మేనేజ్‌ చేస్తోంది. మరో వైపు ఇస్రో మంగళవారం చంద్రుడికి చెందిన 3డీ ఇమేజ్‌ను రిలీజ్‌ చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....