దళితవాణి National Magazine – క్యాలెండర్ విడుదల

హైదరాబాద్, జనవరి 01 (ఇయ్యాల తెలంగాణ) దళితవాణి వారపత్రిక 2024 సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర ప్రభుత్వ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దళితవాణి ప్రతినిధుల బృందం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం పేదల అభివృద్ధికి కృషి చేయాలని స్పీకర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సంఘాల సీనియర్ నాయకులు జెబి రాజు దళితవాణి ప్రతినిధుల బృందం సభ్యులు తోటకాడి రమేష్ బాబు, పేరోజు మహేష్,సత్యనారాయణ,భుజేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....