దెయ్యాల పేరిట వీడియోలు?కేసులు నమోదు

 హైదరాబాద్‌ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );బేగంపేట్‌ పరిధిలోని కుందన్బాగ్లోని ఓ బంగ్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ కొంతమంది వీడియోలు తీసి సోషల్‌ విూడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి కాస్తా వైరల్‌ కావడంతో రాత్రివేళ చాలామంది యువకులు అక్కడికి చేరుకుని కుందన్బాగ్లో బూతు బంగ్లాకి తాము వచ్చామంటూ వీడియోలతో నెటిజన్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ వ్యవహారంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ భవనంలో కొన్నేళ్ల క్రితం ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఇప్పటివరకు ఈ మరణాలు మిస్టరీగానే ఉన్నాయి. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్‌ కావడంతో.. చనిపోయిన వారే ఆ బంగ్లాలో దెయ్యాలుగా తిరుగుతున్నారంటూ ఆకతాయిలు వీడియోలు తీసి పోస్ట్‌ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన పోలీసులు ఇలాంటి వీడియోలు తీసి వైరల్‌ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత మూడు రోజుల్లో ఏకంగా 35 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కుందన్‌ బాగ్లో దెయ్యాల కొంప అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఈ వదంతులను ఎవరూ నమ్మొద్దని సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని.. కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించామని పంజాగుట్ట అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ మోహన్‌ కుమార్‌ తెలిపారు. కుందన్బాగ్లో బంగ్లా వద్ద కొద్దిరోజులు పోలీసు పహారా ఉంచుతామని.. ఎవరైనా అటువైపు వచ్చి వీడియోలు తీస్తే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....