దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ITసోదాలు !

హైదరాబాద్‌ : ప్రముఖ కార్పోరేట్‌ కళాశాల గ్రూప్‌ శ్రీ చైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను అధికారులు సోదాలకు దిగారు. ఆంధ్ర తెలంగాణ తో పాటు ఢల్లీి, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు, విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్‌  చెల్లించకుండా ఎగవేసినట్లు గుర్తించారు.  విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్‌ తయారు చేసుకొని లావాదేవీలు జరిపారు. ప్రభుత్వానికి కట్టే టాక్స్‌ కొరకు మరొక సాఫ్ట్వేర్‌ ఏర్పాటు చేసుకుంది శ్రీ చైతన్య  యాజమాన్యం.

మాదాపూర్‌ లోని శ్రీ చైతన్య కాలేజ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో సోదాలు జరుగుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....