దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబిబిఎస్‌ తరగతులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌ నుండి వర్చువల్‌ గా ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ  ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం.  ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి. ఇది సీఎం కేసిఆర్‌ పట్టుదలకు నిదర్శనం.  రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామని అన్నారు.  గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించాం.   ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్‌ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం. ఇది గొప్ప రికార్డు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.   మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్‌ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది.  ఒకప్పుడు బెంగాల్‌ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేది. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్‌ ది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అని సీఎం కేసీఆర్‌ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారు.    ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ ది.  ఈరోజు అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు.  ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో నాకూ భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌ కు హృదయ పూర్వక ధన్యవాదాలని అన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....