హైదరాబాద్, డిసెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ) : దివంగత మాజీ ప్రధాని పీవి నరసింహారావు దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మేధావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. శనివారం నాడు అయన పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగానివాళులు అర్పించార.తరువాత రేవంత్ మాట్లాడుతూ పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్నికుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారు. భూమిని పేదవాడికి అందుబాటులోకితీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లనుఅభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
- Homepage
- Telangana News
- దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ : CM Revanth Reddy
దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ : CM Revanth Reddy
Leave a Comment