భోపాల్ జూన్ 27 ,(ఇయ్యాల తెలంగాణ ): కేంద్రంలోని అధికార బీజేపీ తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ మధ్య రాజీ కుదిరిందని, ఈ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని, ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బిడ్డ గెలవాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ప్రధాని మోదీ పేరు ఎత్తకుండా పరోక్షంగా విమర్శిస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా సీఎం కేసీఆర్, ఎంఎల్సీ కవిత పేర్లు ప్రస్తావించి మరీ ఎటాక్ చేశారు. మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించాలని అర్థం వచ్చేలా స్పష్టమైన వైఖరిని కనపరచడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మొదటిసారి కేసీఆర్‌పై మోదీ ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారని చర్చించుకుంటున్నారు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహించింది. మంగళవారం నిర్వహించిన పలు ఈవెంట్స్‌లో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
- Homepage
- General News
- దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి
దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి
Leave a Comment