దేశ వ్యాప్తంగా హైకోర్టుల్లో 71,000 కు పైగా పెండింగ్ లో కేసులు

న్యూఢిల్లీ,  జూలై 28 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్ లో  ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మరోవైపు డిస్ట్రిక్ట్‌, సబార్డినేట్‌ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశాబ్దాలుగా పెండిరగ్‌లో ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కోర్టుల్లో మొత్తం పెండిరగ్‌ కేసుల సంఖ్య ఐదు కోట్ల మార్క్‌ను దాటినట్టు తెలిపారు.సుప్రీంకోర్టులో జూలై 1 నాటికి 69,766 కేసులు పెండిరగ్‌లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. హైకోర్టుల్లో 60,62,953 కేసులు, డిస్ట్రిక్ట్‌, సబార్డినేట్‌ కోర్టుల్లో 4,41,35,357 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని చెప్పారు. కేసులు పేరుకుపోవడానికి కేవలం న్యాయమూర్తుల కొరత ఒక్కటే కారణం కాదని పేర్కొన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కేసుల్లో సంక్లిష్టత, బార్‌, దర్యాప్తు సంస్థలు, సాక్షులు, కక్షిదారులు తదితర భాగస్వామ్యపక్షాల సహకారం వంటి అంశాలు కూడా కేసుల పెండిరగ్‌కు కారణమని వివరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....