‘ధన్యవాద్‌ యాత్ర’ పేరిట మరో యాత్రకు Rahul

లక్నో, జూన్‌ 12, (ఇయ్యాల తెలంగాణ) : సార్వత్రిక సమరంలో ఫలితాలు దాదాపు తారుమారయ్యాయి. మూడో సారి ప్రధానిగా అధికారం చేపట్టనున్న మోదీకి ఈ ఎన్నికలు చక్కని గుణపాఠం చెప్పాయి. ముఖ్యంగా మత రాజకీయాలు, మత విద్వేషాలతో ఓట్లు రావన్న సంగతి ఇప్పటికైనా బీజేపీ నేతలు గుర్తించాలని రాజకీయ విమర్శకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యూపీలోనే బీజేపీకి మెజారిటీ స్థానాలు తగ్గిపోయాయి. అనూహ్యంగా కాంగ్రెస్‌ కూటమికి అత్యధిక సీట్లు వచ్చాయి. ఈ ప్రభావం యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే రాహుల్‌, అఖిలేష్‌ ఆధ్వర్యంలో యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు కాంగ్రెస్‌ కూటమి సిద్ధం అవుతోంది. మొత్తం యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో ‘ధన్యవాద్‌ యాత్ర’ పేరిట ఈ యాత్ర ఉండబోతోంది. ఈ ధన్యవాద్‌ యాత్ర  15న ముగుస్తుంది. ఈ యాత్రలో కూటమి సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు. యూపీలో మొత్తం 80 పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్‌ కూటమి ఏకంగా 43 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీ 33 సీట్లకే పరిమితం అయింది. సమాజ్‌ వాదీ పార్టీ 37.. కాంగ్రెస్‌ 6 స్థానాల్లో గెలుపొందింది. 

కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌ బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా.. ఎస్పీ ఒక స్థానం, కాంగ్రెస్‌ 5 స్థానాల్లోనే గెలుపొందింది.యూపీలో బీజేపీ కూటమి ఓటమికి బలీయమైన కారణం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని చర్చనీయాంశంగా చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి 2021 వరకూ యూపీ ఆర్థిక వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 1.95 శాతం చొప్పున మాత్రమే వృద్ధి సాధించింది. ఇక తలసరి ఆదాయ వృద్ధి సంవత్సరానికి 0.43 శాతం మాత్రమే. అంతకు ముందు అంటే 2012`17 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి సంవత్సరానికి 6.92 శాతం చొప్పను పెరగింది. 2007`12 మధ్యకాలంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కాలంలో 7.28 శాతం చొప్పన పెరిగింది. యోగా అధిత్యనాథ్‌ హయాంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పటికీ నేరస్థులపై యోగి అనుసరించిన విధానం పౌర హక్కులకు భంగం కలిగించే రీతిలో ఉన్నాయయి విమర్శలొచ్చాయి. పైగా యోగికి బుల్డోజర్‌ బాబాగా అపఖ్యాతి వచ్చింది. నేరస్థుల ఇళ్లపై బుల్డోజర్‌ పంపి కూల్చివేయడం వంటి చర్యలు అన్నీ బీజేపీపై వ్యతిరేకత పెంచేలా చేశాయియూపీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల విూదుగా యమునా, గంగ ఎక్స్‌ప్రెస్‌ వే, సనౌటా?పుర్కాజీ ఎక్స్‌ప్రెస్‌ వే, వారణాసి ?నోయిడాల మధ్య ఎనిమిది లేన్ల రహదారి వంటి అనేక భారీ ప్రాజెక్టులు మొదలయ్యాయి. అలాగే కుశినగర్‌, జేవార్‌ల వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికీ ప్రణాళిక సిద్ధమైంది. కానీ, ఈ రెండిరటికీ బీజం పడ్డది మాయావతి కాలంలో. అఖిలేశ్‌ ఈ ఆలోచనలను కొనసాగించారు. మొత్తం విూద 2024 ఎన్నికలు హిందూత్వ భావజాలానికీ, సామాజిక న్యాయాన్ని కోరే మండల్‌ వర్గాలకూ మధ్య హోరాహోరీగానే సాగింది. రాముడి చుట్టూ తిరిగిన రాజకీయాలను కాస్తా ప్రజల జీవనోపాధి సమస్యల వైపు మళ్లించిన ఘనత ‘ఇండియా’ కూటమికి దక్కుతుంది. ఇంకోలా చెప్పాలంటే 2014 తరువాత మొదటిసారి బీజేపీ మతతత్వ పాచిక పారలేదని చెప్పాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....