ధరణి తో రైతులు తీవ్ర ఇబ్బందులు VRO, VRA వ్యవస్థను పునరుద్దిస్తాం పట్టభద్రుల MLC తాటిపర్తి జీవన్‌ రెడ్డి


జగిత్యాల అక్టోబర్ 25 (ఇయ్యాల తెలంగాణ ):ధరణి తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ,కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వీఆర్‌ఏ,వీఆర్వో వ్యవస్థను పునరుద్దిరిస్తామని ,ధరణి సమస్యలను 4 నెలల్లో పరిష్కరిస్తామని కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి ఆన్నారు..బుధవారంజగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌ లో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం సాధించుకున్నది కొలువుల కోసమా.. కొలువుల కోత కోసమా.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. 30 వేల నిరుద్యోగుల కొత్త ఉద్యోగాలను సీఎం కేసీఆర్‌ కొల్లగొట్టారని మండిపడ్డారు.. తెలంగాణ రాష్ట్ర సాధనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ తోభూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని ,దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ధరణీ సమస్యలు లేని గ్రామమే లేదన్నారు..రాష్ట్రంలో లక్షలాది ధరణి దరఖాస్తులు పెండిరగ్లో ఉన్నాయని, ధరణి పై ఎన్నికల్లో కొట్లాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు..  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి సమస్యలను పరిష్కరించి, నూతన విధానాన్ని అమలు చేస్తామని ఎమ్మెల్సీ అన్నారు. రెవెన్యూ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి, 4 నెలల్లో ధరణి సమస్య పరిష్కారిస్తామన్నారు.దేశంలో  సాగుకాలం రికార్డు తొలగించినరాష్ట్రం తెలంగాణనే అని అన్నారు..కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పటేల్‌, పట్వారి వ్యవస్థను మొదవుతుందని మంత్రి హరీష్‌ రావు వాఖ్యాలపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు . అసలు పటేల్‌, పట్వారి వ్యవస్థకు ధరణికి ఏం సంబంధం అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు..1983 `84 లోనే సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే కాకముందే అప్పటి సీఎం తారక రామారావు పటేల్‌, పట్వారి వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో ఆని హరీష్‌ రావు ను ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, టిపిసిసి నాయకుడు బండ శంకర్‌, గజేంగి నందయ్య, కొత్తమోహన్‌ ,గాజుల రాజేందర్‌, కల్లేపెల్లి దుర్గయ్య, సర్పంచ్‌ గంగారెడ్డి, పుప్పాల అశోక్‌, ప్రేమ్‌ సాయి తదితరులు పాల్గొన్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....