నకిలీ Loan యాప్ లతో మోసపోతున్న సామాన్యులు !

పెరిగిన టెక్నాలజీ తో ప్రతి పని సులభంగా వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ కార్య కలాపాలు శరవేగంగా చేసుకోగలుగుతున్నాం. డిజిటల్ విప్లవంలో భాగంగా డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫామ్ ల ఆవిర్భావం గణనీయంగా పెరిగింది. వీటిని ఉపయోగించి వ్యక్తిగత రుణాలను మొబైల్ ద్వారా కొన్ని నిముషాల్లో పొందే అవకాశం కలిగింది. అలాగే బ్యాంకులు – నాన్ – బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు (NBFC) వివిధ రకాల రుణాలను అందజేస్తున్నాయి. భారీగా పెరిగిన ఇన్ స్టంట్ లోన్ యాప్ లలో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసు కోవడం కష్టంగా మారింది. అయితే కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనిస్తే ఫేక్ యాప్ లకు దూరంగా ఉండవచ్చు. సైబర్ నేరగాళ్లు అనేక నకిలీ యాప్ ల ద్వారా రుణాల పేరుతొ ఆకర్షిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరిత ఆమోదం తక్కువ వడ్డీ పేర్లతో వల వేస్తున్నారు. ఋణం ఆమోదం కోసం ముందుగా కొంత చెల్లించాలని చెప్పి, డబ్బులు దోచుకుంటున్నారు. లేకపోతె వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నకిలీ రుణాల పేరుతొ వల వేస్తున్న సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ కోసం కొన్ని విషయాలను గమనించాలి. తద్వారా అప్రమత్తంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....