నగదు స్వాధీనం

హైదరాబాద్‌ అక్టోబర్ 5 (ఇయ్యల తెలంగాణ ):బుధవారం రాత్రి పురానాపూల్‌ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్‌ పోలీసులకు ఓ ద్విచక్ర వాహనదారుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని ఆపి వాహనాన్నిసోదాలు చేసారు. అతని వద్ద నుండి 18 లక్షల రూపాయల నగదు లభ్యమయ్యాయి. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు రోహిత్‌ అనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను హవిూదుల్లా ఖాన్‌ అనే వ్యక్తి కోసం కలెక్షన్‌ ఏజెంట్గా పని చేస్తున్నట్లు  వెల్లడయ్యింది.లెక్కలేని మరో 17 లక్షల 50 వేల రూపాయలు ముషీరాబాద్‌ లోని స్క్రాప్‌ దుకాణంలో ఉన్నట్లు సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మొత్తం 35 లక్షల 50 వేల రూపాయల లెక్కలేని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....