నటి సౌందర్యను నటుడు Mohan బాబు హత్య చేయించాడా ?


ఖమ్మం మార్చి 12 ఇయ్యాల తెలంగాణ : 

 హెలికాప్టర్ల ప్రమాదంలో నటి సౌందర్య మరణించిన సంఘటనపై సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు సంచలన ఆరోపణలు చేశారు. సౌందర్య మరణానికి నటుడు మోహన్‌ బాబు కారణమని అనుమానం వ్యక్తం చేశాడు. సౌందర్య మృతి అనేది ప్రమాదం కాకుండా ఓ కుట్ర కేసుగా పరగణలోకి తీసుకొని విచారించాలని కలెక్టర్‌ కు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు ఫిర్యాదు చేశాడు. జల్లేపల్లిలోని సౌందర్యకు సంబంధించిన ఆరు ఎకరాల గెస్ట్‌ హౌస్‌ ను మోహన్‌ బాబు అమ్మాలని ఆమె, ఆమె సోదరుడు అమర్‌ నాథ్‌ బెదిరించాడని ఆరోపణలు చేశారు. 

వాళ్లు నిరాకరించడంతో హత్యకు ప్లాన్‌ చేశాడని అనుమానం వ్యక్తం చేశారు.జల్లేపల్లిలో ఆరు ఎకరాలు గెస్ట్‌ హౌస్‌ లను మోహన్‌ బాబు అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నాడని, ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చిట్టిమల్లు డిమాండ్‌ చేశారు. పరోక్షంగా సౌందర్యను మోహన్‌ బాబు హత్య చేశాడని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఉలిక్కిపడిరది.  సౌందర్య మృతిపై ఇప్పటికి అనుమానాలు ఉన్నాయని ఆమె అభిమానులు సోషల్‌ విూడియాలో కామెంట్లు చేస్తున్నారు. 2004 సంవత్సరం ఏప్రిల్‌ 17వ తేదీన సౌందర్య, తన సోదరుడు అమర్‌ నాథ్‌తో కలిసి వరంగల్‌కు బిజెపి తరపున ఎన్నికల ప్రచారానికి వస్తుండగా హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....