నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ పై – ఎంథాలజీ ‘‘విూట్‌ క్యూట్‌’’ టీజర్‌ విడుదల

 నేచురల్‌ స్టార్‌ నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న  ఎంథాలజీ ‘‘విూట్‌ క్యూట్‌’’ తో స్ట్రీమింగ్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. నాని సోదరి దీప్తి గంటా ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సిరిస్‌ హక్కులని సోనీ లివ్‌ పొందింది, త్వరలో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది. ఈరోజు ‘‘విూట్‌ క్యూట్‌’’ టీజర్‌ ని రిలీజ్‌ చేసి మేకర్స్‌ ప్రమోషన్స్‌ ని ప్రారంభించారు. అపరిచితుల క్యూట్‌ విూటింగ్స్‌, ఆహ్లాదకరమైన సంభాషణలు, భావోద్వేగాలని టీజర్‌ అద్భుతంగా ప్రజంట్‌ చేసింది. ప్రేమ, కోపం, ఆశ, భయం, ఆశ్చర్యం, హార్ట్‌ బ్రేక్‌, నమ్మకం, సంతోషం ఇలా అన్నీ భావోద్వేగాలు ఆకట్టుకునేలా వున్నాయి. ‘’చిన్న చిన్న గొడవలు వలన రిలేషన్‌ షిప్స్‌ ఫెయిల్‌ కావు. ఫైట్‌ చేయటం ఆపేసినప్పుడు ఫెయిల్‌ అవుతాయి’’ అనే డైలాగ్‌ తో టీజర్‌ ముగించడం క్యూరియాసిటీని పెంచింది. దీప్తి గంటా తన మొదటి ప్రయత్నంలోనే రచయిత్రిగా, దర్శకురాలిగా గ్రేట్‌ ఇంపాక్ట్‌ ని చూపించారు.  ఆమె రచనలో చాలా పరిపక్వత కనబడిరది. సిరిస్‌ లో కథలన్నీ అందరూ రిలేట్‌ చేసుకునేలా,  అన్ని వర్గాలా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా రూపొందించారని టీజర్‌ చూస్తే అర్ధమౌతోంది. ప్రొడక్షన్‌ డిజైన్‌ అత్యున్నతంగా వుంది. సత్యరాజ్‌, రోహిణి మొల్లేటి మెయిన్‌ పిల్లర్స్‌ కాగా, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్‌, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచా కథానాయికలుగా,  అశ్విన్‌ కుమార్‌, శివ కందుకూరి, దీక్షిత్‌ శెట్టి, గోవింద్‌ పద్మసూర్య, రాజా తమ పాత్రలో కథనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. వసంత్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ, గ్యారీ బిహెచ్‌ ఎడిటింగ్‌ ఆకట్టుకున్నాయి. టీజర్‌ విజువల్‌ ట్రీట్‌ గా వుంది. విజయ్‌ బుల్గానిన్‌ తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సరైన మూడ్‌ని సెట్‌ చేశాడు. ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా మాస్టర్‌వర్క్‌ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. విూట్‌ క్యూట్‌ లాంటి సిరిస్‌ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు  చూస్తున్నారు.  ఈ ఎంథాలజీ  అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించబోతుంది. టీజర్‌తో సిరీస్‌ చూడాలనే ఉత్సుకత మరింతగా పెరిగింది. ప్రీమియర్‌ డేట్‌ ని త్వరలో తెలియజేస్తారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....