నియంతను గద్దె దించాలి

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి సోమవారం టీజేఎస్‌ అధ్యక్షుడు కొందడరామ్‌ తో భేటీ ముగిసింది. తరువాత అయన విూడియాతో మాట్లాడారు. గత పదేళ్లుగా బీఆరెస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాంపోరాడుతున్నారు. ఆయన మద్దతు కాంగ్రెస్‌ కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చాము. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కలిసి ముందుకెళతాం. భవిష్యత్‌ లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతాం. టీజేఎస్‌ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుంది. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్‌,కాంగ్రెస్‌ కలిసి పనిచేస్తుంది. వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో టీజేఎస్‌ కు కీలక స్థానం ఉంటుంది. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హావిూ ఇచ్చారని అన్నారు.సీట్లు ఓట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నాం. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్‌ ప్రయివేటు సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలుతీసుకుంటాం. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ తో పాటు హ్యాకర్స్‌ ను ఉపయోగించి మా ఫోన్‌ లు హ్యాక్‌ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ ను నియంత్రించాలని కేటీఆర్‌, కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ కు ఎవరూ సాయంచేయకుండా కేటీఆర్‌ బెదిరిస్తున్నారు. మేం ఫోన్‌ లో ప్రయివేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్‌ చేసి వింటున్నారు.  మమ్మల్ని సంప్రదించిన వారిని బెదిరిస్తున్నారని అన్నారు. .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....