హైదరాబాద్ జులై 09 (ఇయ్యాల తెలంగాణ );ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం విూద కన్నెర్ర చేసి కేసీఆర్ ఓడిపోతేనే మాకు నౌకరులు వస్తాయని నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇచ్చిన హావిూలకు ఇప్పుడు చేతలకు పొంతన లేకుండా పోయిందని ఎంపి ఈటల రాజేందర్ విమర్శించారు. వారు రెండే డిమాండ్ చేస్తున్నారు.. ఒకటి ఉద్యోగాల సంఖ్య పెంచి నోటిఫికేషన్ తిరిగి ఇవ్వమంటున్నారు. రెండవది పరీక్షకు పరీక్షకు మధ్యలో గ్యాప్ ఉండేలా ఎక్సమ్ డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆ విద్యార్థులు బయట అందోళనలు, దీక్షలు చేస్తున్నారు.. ఇళ్లలోనే కూర్చొని నిరాహారదీక్ష చేస్తున్నారు. అలాంటి వారి విూద లాఠీచార్జిలు చేస్తున్నారు,కొడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. వారు అనుభవిస్తున్న నరకం చూస్తుంటే బాధ అనిపిస్తుంది మొత్తం విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు ఈ ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విూద అసహ్యం కలిగింది.రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పారో దానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నారు. నిరుద్యోగుల డిమాండ్లకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతును అందిస్తుంది. వారు చేసే ఉద్యమాల్లో మేము ప్రత్యక్షంగా పాల్గొంటాము. బీజేవైఎం తెగించి ఆందోళన చేస్తుంది. లాఠీచార్జీ చేసిన, జైల్లో పెట్టిన వెనకడుగు వేయడం లేదు. మేము కూడా విూ వెంట ఉంటామని అన్నారు.
- Homepage
- Telangana News
- నిరుద్యోగులకు అండగ వుంటాం Etela Rajander
నిరుద్యోగులకు అండగ వుంటాం Etela Rajander
Leave a Comment