నిరుద్యోగ Yuvata స్వయం ఉపాధి మార్గాలను కూడా ఎంచుకోవాలి..

ఆళ్లగడ్డ, జూన్ 19 (ఇయ్యాల తెలంగాణ) : నిరుద్యోగ యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి మార్గాల వైపు కూడా దృష్టి సారించాలని ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు చింతకుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలో కొందరు నిరుద్యోగులు స్థాపించిన ఆటోమొబైల్స్‌ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన భాషా, షరీఫ్‌, రసూల్‌ రఫీ తదితర యువత తమ కాళ్ళ విూద తాము నిలబడుతూ ఆటోమొబైల్స్‌ దుకాణాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఎంతో గర్వకారణమన్నారు.ఈ యువతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకున్న వారికి టీడీపీ ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుందని..  నిరుద్యోగులకు రుణాలు ఇచ్చి వారిని స్వయం ఉపాధి మార్గాల వైపు నడిపించేందుకు పలు బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఆటోమొబైల్స్‌ వాటర్‌ వాష్‌ ప్లాంట్‌ లను ఏర్పాటు చేసిన యువకులను టిడిపి నేత శ్రీనివాస రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో శిల్పి సంజీవ, శిల్పి శివ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....