నేటితో ముగియనున్న రూ. 2000 నోట్ల చలామణి

న్యూఢల్లీ అక్టోబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ ): రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు రేపటితో గడువు ముగుస్తుండటంతో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రూ. 12,000 కోట్ల విలువైన (3.37 శాతం) 2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రూ. 2000 నోట్లలో 96 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్ధకు వచ్చాయని చెప్పారు.ఇప్పటివరకూ రూ. 3.43 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరాయని కేవలం రూ. 12,000 కోట్ల విలువైన నోట్లు మిగిలిఉన్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. 87 శాతం బ్యాంక్‌ డిపాజిట్లుగా వచ్చాయని, మిగిలినవి ఇతర నోట్లతో ఎక్స్ఛేంజ్‌ చేసుకున్నారని ఆయన వెల్లడిరచారు.రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ మే 19న వెల్లడిరచే నాటికి రూ. 3.56 లక్షల కోట్లు వ్యవస్ధలో ఉండగా, ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ. 3.44 లక్షల కోట్లు తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తిరిగివచ్చాయని చెప్పారు. ఇక అక్టోబర్‌ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్లను ఖాతాల్లో జమచేయడం, లేదా ఇతర బ్యాంక్‌ నోట్లతో ఎక్స్ఛేంజ్‌ను నిలిపివేస్తాయని ఆర్బీఐ పేర్కొంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....