నేడు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ): అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని   ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది. ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వ అంశాలు, ప్రజాస్వామ్యం యొక్క అంతర్జాతీయ పరిధిని ధృవీకరించేందుకు ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపియు) ఆధ్వర్యంలో 1997, సెప్టెంబరు 16న ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశంలో ప్రజాస్వామ్యంపై సార్వత్రిక ప్రకటన వెలువడిరది. కొత్త, పునరుద్ధరించబడిన ప్రజాస్వామ్య దేశాలపై అంతర్జాతీయ సమావేశాలు 1988లో ప్రారంభం అయ్యాయి.2006లో ఖతార్‌ లోని దోహాలో జరిగిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య సమావేశాలు ఆరవ సమావేశం (ఐసిఎన్‌ఆర్‌డి `6) లో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానం యొక్క ముసాయిదాను రూపొందించడంలో ఖతార్‌ ముందడుగు వేసి, సభ్యదేశాలతో సంప్రదింపులు జరిపింది. చివరకు ఐపియు సూచనమేరకు 2007, నవంబరు 8న జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15వ తేదీన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంను నిర్వహించాలని తీర్మానించి, 2008 నుండి అమలుచేయడం జరిగింది.సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే విధమైన విలువలపైన ఆధారపడి జీవితాలను గడిపే హక్కు కలిగించడమే దీని లక్ష్యం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....