ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. ఇందులో జాతి, భాష, కుల, మతాలకతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం.అలాంటి మానవ హక్కుల దినాన్ని 10 డిసెంబర్ 1948న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటినుండి ప్రతిసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.1948, డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటుచేయబడ్డాయి. భారతదేశంలో ..క్రీ.శ.1215లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుండే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రూపొందాయి. 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8నుండి అమలులోకి వచ్చింది.
- Homepage
- writers voice
- నేడు అంతర్జాతీయ Human Rights దినోత్సవం
నేడు అంతర్జాతీయ Human Rights దినోత్సవం
Leave a Comment