నేడు అంతర్జాతీయ Tea దినోత్సవం

నిజమే టీని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చాయ్‌ ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2020 మే 21ని అంతర్జాతీయ టీ దినంగా ప్రకటించింది.    సంబంధిత తీర్మానం డిసెంబర్‌ 21, 2019న ఆమోదించబడిరది మరియు ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌  ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని కోరింది. ఈ రోజే మూడోవ టీ దినం అయినందున.. టీ ప్రియులందరికీ శుభాకాంక్షలు.  వేల సంవత్సరాల క్రితం చైనా దేశంలో పుట్టిన టీ ప్రపంచ మంతా మనుషుల మధ్య అనుబంధానికి, అను సంధానంగా మారింది. అంతటి పేరున్న టీ మంచిదేనని నిపుణులు అంటున్నారు.ఇక టీ చరిత్ర విషయానికి వస్తే.. 15వ శతాబ్దంలో చైనాలో ఒక వైద్యుడు ఆకులను తుంచి ఎండబెట్టి ఒక ప్రత్యేకత ఉష్ణోగ్రతకు వేడి చేసి వేడి నీటిలో నాన బెట్టగా వచ్చిన డికాషన్‌ను వైద్య పరీక్షలో సేవించాడు. డికాషన్‌ తాగడం వల్ల ఉత్తేజాన్ని పొందాడు. 17వ శతాబ్దంలోకి వచ్చే సరికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, నల్ల మందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్‌ సోదరులు అస్సాంలో తేయాకులు కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన మొదలైంది.  ప్రస్తుతం అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాషా?ట్రల్లో ఎక్కువగా ఉండగా త్రిపుర, కర్ణాటక, మణిపూర్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా తేయాకు తోటలు ఉన్నాయి. ఇక టీ లో ఎన్నో రకాలు వచ్చాయి.  అల్లం, ఇలాచీ, మసాల, దమ్‌,ఇరానీచాయ్‌లతో పాటు చక్కని ఆరోగ్యం కోసం గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, బ్లాక్‌ టీ, మెంతాల్‌, హెర్బల్‌ టీ ఇలా చాలానే అందుబాటులోకి వచ్చాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....