హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : పంజాగుట్టలో ఒక కారు యజమాని ట్రాఫిక్ పోలీసులపై చిందులేసాడు. ‘‘రెండు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తా..’’’ అంటూ ట్రాఫిక్ పోలీసుల విూద మండిపడ్డాడు. నాలుగు వేల పెండిరగ్ చలానా కోసం నా కారు ఆపడానికి ఎన్ని గుండెలని విరుచుకుపడ్డాడు. నా ఇంట్లో కారుకు 16 వేల పెండిరగ్ చలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా అని వీరంగం సృష్టించాడు. పంజాగుట్ట మెర్క్యూర్ హోటల్ వద్ద వాహన తనిఖీలలోఈ న్యూసెన్స్ జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. ..