జగిత్యాల అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు చేపడుతున్నామని గడిచిన 24 గంటల్లో జిల్లా పరిధిలో వాహనాల తనిఖీల్లో మొత్తం 10,17,000 రూపాయలు, 190.25 లీటర్ల విలువ గల మద్యం సుమారుగా అంచనా విలువ 68,382 రూపాయలు, 72 బ్యాటరీ స్టవ్స్ సుమారుగా అంచనా విలువ 1,44,000 రూపాయలు పట్టుకొని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు
- Homepage
- Telangana News
- పకడ్బందీగా ఎన్నికలు కోడ్ అమలు
పకడ్బందీగా ఎన్నికలు కోడ్ అమలు
Leave a Comment