సికింద్రాబాద్, జూన్ 14 (ఇయ్యాల తెలంగాణ) : సికింద్రాబాద్ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో అభివృధి పనులను చేపట్టామని, పరిష్కారానికి నోచని అనేక సమస్యలపై ఇంకా దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని మెట్టుగూడ డివిజన్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన అక్కడి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయా సమస్యల పరిష్కారానికి కాల పరిమితిని నిర్దారిస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంతో అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి దారి సుగమం అవుతుందని పద్మారావు పేర్కొన్నారు.ఆయన వెంట మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత, అధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.మెట్టుగూడ డివిజన్ లోని విజయపురి కాలని, రైల్వే క్వార్టర్స్, మెట్టుగూడ ప్రాంతాల్లో పద్మారావు పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో తెరాస యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ లతో పాటు రాజేశ్ గౌడ్, గుండవేణి తెరాస నాయకులు మరియు వివిద విభాగాల అధికారులు రమణా రెడ్డి, ఆశలత, డేవిడ్ రాజు, డాక్టర్ రవీందర్ గౌడ్, విశ్వా తేజ, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.