సనత్ నగర్, జూన్ 3 (ఇయ్యాల తెలంగాణ) : బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా దిగువ స్థాయి ఉద్యోగిగా సేవలు అందిస్తూ పదవీ విరమణ పొందిన అంజమ్మకు బీజేపీ పరివార్ సభ్యులు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ బీజేపీ నాయకులు యేచన్ సురేష్, తాళ్ల జైహింద్ గౌడ్, చరణ్ సింగ్, పొలిమేర సంతోష్ కుమార్, రాజు గౌడ్, అమర్నాథ్, మరియు ఆలయ సిబ్బంది అర్చకులు శ్రీను చారి, మణిశర్మ, స్థానికంగా మరియు సిబ్బంది కరుణ, లావణ్య, అరుణ్, పరశురాం, నాగరాజు, జ్యోతి, నరసింహ, శీను,ఇతర సభ్యులు అంజమ్మను శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక సిబ్బంది పదవీ విరమనానంతరం ఆమె రేణుక ఎల్లమ్మ తల్లి కృపాకటాక్షాలతో సంపూర్ణారోగ్యంతో శేష జీవితం గడపాలని ఆశీర్వదించారు. అనంతరం బీజేపీ పరివార్ సభ్యులు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా అంజమ్మ ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ తన విధులను త్రికరణశుద్ధితో నిర్వహించడాన్ని గుర్తు చేసుకుని ఆమెను ప్రశంసించారు.
- Homepage
- Sanath Nagar News
- పదవీ విరమణ పొందిన అంజమ్మకు బీజేపీ పరివార్ సన్మానం
పదవీ విరమణ పొందిన అంజమ్మకు బీజేపీ పరివార్ సన్మానం
Leave a Comment
Related Post