పదవ తరగతి Exams కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

 ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేనీ సునీల్‌

 కోరుట్ల,

ప్రస్తుతం జరుగుతున్న పదోతరగతి పరీక్షలు నైపథ్యంలో

పదో తరగతి పరీక్షల కేంద్రాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేనీ సునీల్‌ ఆన్నారు.. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

పరీక్షలు రాసే విద్యార్థులు

పరీక్ష కేంద్రాలలో త్రాగు నీరు సదుపాయం కల్పించాలని, రూంలలో పరిశుభ్రత పాటించాలని కోరారు. అలాగే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్ష సమయాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా తాము చదివిన జవాబు పత్రాలలో వ్రాయలని ఆయన సూచించారు, అదేవిధంగా పరీక్షలు భయంతో కాకుండా బాధ్యత తో వ్రాయాలని  అన్నారు.. విద్యార్థులకి  త్రాగు నీరు, ఏర్పాటు చేయాలనీ పాఠశాల యాజమాన్యంలను కోరారు.. 10వ తరగతి విద్యార్థులకు ఆయన ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....