పలు అగ్రకుల నేతల పార్టీల దిష్టిబొమ్మల దగ్ధం

మంథని సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):మంథని ప్రధాన చౌరస్తాలో బీఆర్‌ఎస్‌, బిజెపి,  కాంగ్రెస్‌, పలు అగ్రకుల నేతల పార్టీల దిష్టిబొమ్మను ధర్మ సమాజ్‌ పార్టీ ప్రతిపాదిత ఎమ్మెల్యే అభ్యర్థి చిట్యాల శ్రీనివాస్‌ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు శాతం లేని అగ్రకులాలకు నాయకత్వం వహించే అర్హత లేదని, తక్షణమే అగ్రకుల నేతలు తమ అధినేత పదవికి రాజీనామా చేసి పార్టీ అధినేతగా బహుజన కులానికి చెందిన వ్యక్తిని నియమించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళిత వ్యక్తిని ప్రతిపాదించాలని ఈ కార్యక్రమంలో నియోజకవర్గ డిఎస్పి పార్టీ నాయకులు కోరాళ్ల శ్యామ్‌, పేట మహేష్‌,  రవీందర్‌,  శ్రీకాంత్‌,  రమేష్‌ , పులి రాజు,  శ్రీధర్‌,  ప్రణీత్‌ సుశాంత్‌,  నవీన్‌,  మహేష్‌ తదితరులు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....