మంత్రి సీతక్క ను కలసిన పశు వైద్యాధికారులు
హైదరాబాద్ జనవరి 24 పశువైద్య డ పశు సంవర్ధక శాఖ లో పని చేస్తున్న పశు వైద్యాధి కారు లు ( విఏఎస్ )లకు 25 సంవత్సరాల సర్వీసు పూర్తి అవుతున్నా పదోన్నతులు లేవు కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో పునఃవ్యవస్థీకరణ చేసి ప్రమోషన్ ఇప్పించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుదవారం పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) ను కలసి వినతి పత్రం ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సభ్యులు డా .కే.రామారావు , డా.రమేష్ బాబు,డా నరసింహ రావు, డా . శ్రీధర్ రెడ్డి, డా నాగయ్య,డా చంద్రా రెడ్డి డా.భాను నాయక్ డ డా.కిరణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా.మల్లు రవిని కలిసిన ప్రతినిధులు
తదనంతరం డా.మల్లు రవి ని కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. అందుకు మల్లు రవి సానుకూలంగా స్పందించారు. శాస్త్రీయ పద్ధతిలో రిఆర్గనేషన్ చేస్తేనే ప్రమోషన్ త్వరగా వచ్చే అవకాశం ఉందని ,కావున త్వరగా రీఆర్గనైజేషన్ చేయాలని కోరారు. ఉ.ూ.ఔనీ.317 వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని స్థానికతను బట్టి ఆయా జిల్లాలకు తిరిగి కేటాయించాలని కోరారు. అలాగే పెండిరగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలు అన్ని వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది.,పి ఆర్ సి ని సకాలంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా వ మంత్రి డా.మల్లు రవి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.