పహల్గాంపై సమగ్ర దర్యాప్తు ? పాక్‌ వైఖరి సబబే ! మిత్ర ధర్మం మాటలతో China స్పందన

బీజింగ్‌ ఏప్రిల్‌ 28

Ñ: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిపై చైనా నిర్మాణాత్మక రీతిలో స్పందించింది. ఈ ఉదంతంపై త్వరితగతి, సమగ్ర సముచిత విచారణ జరగాలి. నిజానిజాల నిగ్గు తేలాల్సి ఉందని పేర్కొన్న చైనా ఈ విషయంలో పాకిస్థాన్‌ను సమర్ధించింది. పాకిస్థాన్‌కు తమ దేశ సర్వసత్తాకతను చాటుకునే , కాపాడుకునే హక్కు ఉందని తెలిపింది. ఒక దేశంలో అంతర్గత పరిణామాలు, ఘటనలపై ఇతర దేశాలను నిందించడం జరిగితే , ఈ విమర్శలు నిజమా కావా? అనేది ముందుగా నిర్థారించుకుని తీరాలని ఈ దశలో చైనా తమ దేశపు సర్వ వేళల మిత్రపక్షం అయిన పాకిస్థాన్‌కు బాసటగా నిలిచేందుకు రంగంలోకి దిగింది.అయితే పహల్గాంలో జరిగిన నరమేధం వెనుక ఉన్న శక్తులుగురించి నిజాలు తెలియాల్సి ఉంది. దీనికి సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఇది వేగవంతం కావాల్సి ఉందని చైనా తెలిపింది. భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుత తీవ్రస్థాయి ఉద్రిక్తత వాతావరణం సమసిపోయేందుకు, సామరస్య ధోరణి ప్రబలేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నా, వాటిని అంతా స్వాగతించాలి. ఈ విషయంలో చైనా వైఖరి సుస్పష్టం అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గుయో జయాకున్‌ విూడియాతో సమావేశంలో తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దర్యాప్తులో చైనా పాత్ర ఉంటుందని రష్యా విూడియా వెలువరించిన వార్తలపై స్పందించేందుకు ఈ ప్రతినిధి నిరాకరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....